Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

కరోనా... డాక్టర్ శైలజా కృష్ణమూ

కరోనా... డాక్టర్ శైలజా కృష్ణమూ

3 mins
776



జనతా కర్ఫ్యూలో డాక్టర్ శైలజా కృష్ణమూర్తి


22-3-2020 ఉదయం 7గంటలు జనాలంతా జనతా కర్ఫ్యూకి మద్దత్తు ఇచ్చినట్లున్నారు.కాకులు అరుపులు తప్ప అంత పెద్ద సిటీలో చిన్న మోటారు వాహనం శబ్దం కూడా వినించడం లేదు.ఎప్పుడూ రద్దీగా మోటారు వాహనాల రణగొన ధ్వనులు మధ్య వుండే ఆ వీధి నిశ్శబ్దంగా ఉంది.


       "నేను తప్పకుండా డ్యూటీకి వెళ్ళాలి,నీకు రావడానికి వీలుకాకపోతే నువ్వు ఇంటి దగ్గరే ఉండిపో"అని అన్నాడు డాక్టర్ కృష్ణమూర్తి భార్య డాక్టర్ శైలజతో.


          "లేదండీ నేనూ డ్యూటీకి వస్తాను,సిటీలో హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న టైంలో మనం ఇంట్లో కూర్చోవడం సబబు కాదు"అని అంది డాక్టర్ శైలజ.


  మౌనంగా ఉండిపోయాడు డాక్టర్ కృష్ణమూర్తి.


          "ఇదేమి చోద్యమే తల్లీ, ఒకవైపు ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి జనతా కర్ఫ్యూ విధించి,ఎవ్వరూ ఇల్లు దాటి రావద్దు అంటే మీరు డ్యూటీకి వెళ్ళాలి అంటారెంటి" కంగారుగా అంది డాక్టర్ కృష్ణమూర్తి తల్లి.


         "ఏంటమ్మా నువ్వుకూడా అలా మాట్లాడతావు, నువ్వుకూడా చాలా కాలం డాక్టర్ గా పనిచేశావు.పైగా నీకు సిటీలో మంచిపేరుంది,అలాంటిది నువ్వే మాకు పిరికి మందేస్తే ఎలా!"అని అన్నాడు డాక్టర్ కృష్ణమూర్తి.


      "అది కాదురా! ఇప్పుడు ప్రపంచంలో ప్రబలంగా విస్తరిస్తున్న వైరస్ సామాన్యమైంది కాదు కదా...కోవిడ్-19 ఇలాంటి స్థితిలో మనం రిస్క్ తీసుకోడం మంచిది కాదన్నది మీ అమ్మ అభిప్రాయం" నసుగుతూ అన్నాడు డాక్టర్ కృష్ణమూర్తి తండ్రి.


       డాక్టర్ కృష్ణమూర్తి ఫక్కున నవ్వాడు.డాక్టర్ శైలజ ముసి ముసి నవ్వులు నవ్వింది.


"సరిపోయింది విశ్వవిఖ్యాత డాక్టర్ విశ్వేశ్వరయ్య,డాక్టర్ శకుంతులమ్మ దంపతులు ఇప్పుడు కోవిడ్-19 కి భయపడి బాధ్యత గల డాక్టర్లైనా కొడుకుని,కోడల్ని డ్యూటీకి వెళ్లవద్దు అనడం విచిత్రంగా ఉంది"అని అన్నాడు డాక్టర్ కృష్ణమూర్తి.


     "అలాగని కాదు ఈ మధ్య రెస్టులేకుండా డ్యూటీ చేశారు,కనీసం ఈ రోజైనా ఇంట్లో రెస్ట్ తీసుంటారని,పైగా మీ పిల్లలిద్దరూ ఇంట్లోనే వుంటున్నారు,అందరమూ సరదా గడుపు దామని"తడబడుతూ అంది డాక్టర్ కృష్ణమూర్తి తల్లి.


   "అంతే కాదు డ్యూటీ షెడ్యూల్ ప్రకారం మీ ఇద్దరికీ ఈ రోజు డ్యూటీ లేదు కదా"అని అన్నాడు డాక్టర్ కృష్ణమూర్తి తండ్రి.


  "అయినా హాస్పిటల్ లో పరిస్థితి గంభీరంగా ఉంది, డ్యూటీ షెడ్యూల్ తో సంబందం లేకుండా స్టాఫ్ మొత్తం 7×24 హావర్స్ డ్యూటీ అన్నట్లు ఉండాలని అందరమూ నిర్ణయించుకున్నాం.డాక్టర్లే కనిపించకపోతే,వాచ్ మన్ మొదలుకొని నర్సులు,కంపౌండర్స్ ఇతర స్టాఫ్ స్థర్యం కోల్పోతారు,మీకు తెలియంది కాదు,ఇప్పుడున్న వైరస్ కంట్రోల్ కి కాస్తో కూస్తో అవగాహన ఉన్నది హాస్పిటల్ లో మీ కోడలికి నాకే కదా"అని అన్నాడు డాక్టర్ కృష్ణమూర్తి.


    విషయానికి వస్తే డాక్టర్ కృష్ణమూర్తి,డాక్టర్ శైలజ దంపతులు,నగరంలోని ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్ లో మెడికల్ ఆఫీసర్స్ గా పనిచేస్తున్నారు.హాస్పిటల్ లో పాజిటివ్ కేసులు లేకపోయినా,అనుమానస్పద రోగులను స్పెషల్ కేర్ లో ఉంచారు.అలాగే జనతా కర్ఫ్యూ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించి,వాళ్ళు మాత్రం డ్యూటీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.


   డాక్టర్ కృష్ణమూర్తి తలిదండ్రులు విశ్రాంత డాక్టర్లు అయినప్పటికీ కొడుకు,కోడలు,ఇంట్లో చిన్నపిల్లల ఆరోగ్య భద్రత దృష్టిలో ఉంచుకొని బంధుప్రీతి వల్ల కొడుకుని కోడల్ని కరోనా వైరస్ కి దూరంగా ఉంచాలని తాపత్రయం పడుతున్నారు.


    ఇంతలో డాక్టర్ శైలజా కృష్ణమూర్తి దంపతుల కూతురు శ్రీవల్లి నిద్రనుండి లేచింది."హలో డాక్టర్స్ మీరింకా డ్యూటీకి వెళ్లలేదా"అని నవ్వుతూ అంది అమ్మా నాన్నలతో.


     "తాతయ్య నాన్నమ్మ వెళ్లవద్దు,సండే కదా మమ్మల్ని ఇంట్లోనే వుండమంటున్నారు"అని అంది డాక్టర్ శైలజ.


     "అమ్మో మీరు ఇంట్లో వున్నా మీ శరీరాలు ఇక్కడ మీ ఆలోచనలు హాస్పటల్ లో ఉంటాయి,కాబట్టి మీరు ఆసుపత్రిలో ఉండటమే మేలు పైగా సిటీలో హెల్త్ కండీషన్ సెన్సిటివ్ గా వున్నప్పుడు మీరు డ్యూటీలో ఉండటమే కరక్ట్ కదా"అని అంది కూతురు శ్రీవల్లి.


    "గుడ్ తమ్ముడిని జాగ్రత్త ఎటువంటి పరిస్థితిలోనూ మీరు బయటకు వెళ్లకూడదు,నాన్నమ్మ తాతయ్య చెప్పినట్లు బుద్ధిగా ఉండాలి"అని కూతురుకి జాగ్రత్తలు చెప్పి హాస్పిటల్ కి బయలుదేరారు డాక్టర్ శైలజ కృష్ణమూర్తి.


"ఓకే మీరు నిశ్చింతగా డ్యూటీకి వెళ్లి రండి,తాతయ్య, నాన్నమ్మ,తమ్ముడు బాధ్యత నాదీ"అని అంది బిగ్గరగా నవ్వుతూ శ్రీవల్లి.


   అందరూ సరదాగా కాసేపు నవ్వుకున్నారు.


    "సరే జాగ్రత్త టేక్ కేర్"అని కొడుకుకి కోడలికి నవ్వుతూ డ్యూటీకి పంపారు డాక్టర్ కృష్ణమూర్తి అమ్మా నాన్న.


   డాక్టర్ శైలజ కృష్ణమూర్తి డ్యూటీకి బయలుదేరారు, జనతా కర్ఫ్యూ మధ్య,వీధి మలుపు చివర ట్రాఫిక్ పోలీస్ డాక్టర్స్ కి సెల్యూట్ చేసాడు.


        సాయింత్రం కాస్తా లేటుగా ఇంటికి వచ్చిన డాక్టర్ శైలజా కృష్ణమూర్తి దంపతులు "వెరీ గుడ్ న్యూస్ ఫర్ యూ అల్ టు డే ఆల్ సో దేరీజ్ నో కోవిడ్-19 పాజిటివ్ కేస్ ఇన్ అవర్ సిటీ"అని అన్నారు వాళ్ల కోసం ఎదురు చూస్తున్న కుటుంబంతో.


జనతా కర్ఫ్యూ విజయానికి సంకేతంగా ఆ కుటుంబం మొత్తం చప్పట్లు చరిచి సమాజానికి సంఘీభావం తెలిపింది.



Rate this content
Log in

Similar telugu story from Abstract