Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hitesh Kollipara

Drama Romance

4  

Hitesh Kollipara

Drama Romance

లవ్ ఇన్ అమెరికా – 8

లవ్ ఇన్ అమెరికా – 8

6 mins
358


#7_డేస్_7_మెసేజస్


“ఆల్బర్ట్ నాతో గేమ్ ఆడుతున్నాడు?... దానికి మార్గరేట్ కూడా తనవంతు సహకారం అందిస్తుంది. గుడ్..., అంతే చేయండి. నేనూ గేమ్ ప్లే చేస్తే ఎలా ఉంటుందో ఇద్దరికీ చూపిస్తా...”

అలా నిర్ణయించుకుని అమ్మ దగ్గరికి వెళ్లాను. అక్కడే నాన్న కూడా ఉన్నారు.

“అమ్మా..., నేను వాషింగ్ టన్ వెళ్తున్నా. ఇప్పుడే...”

“సాయంత్రం ఫంక్షన్ చూసుకుని వెళ్దామని రాత్రి నాన్నగారు చెప్పారు కదా?”

“మీరు రావద్దు. మీరు ఫంక్షన్ చూసుకునే రండి. నేనొక్కదాన్నే వెళ్తా”

“వద్దు. సాయంత్రం అందరం కలిసి వెళ్దాం”

 “నేను నీ పర్మిషన్ అడగటానికి రాలేదు. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అంతే...”

అమ్మ ఏదో అనబోయింది. ఐతే నాన్న అడ్డుకున్నారు – “సరే వెళ్లనీ..” అమ్మతో అన్నారు.

అమ్మ ఇక మాట్లాడలేదు.                                  

“10:30కి వాషింగ్ టన్ కి ఫ్లయిట్ ఉంది. దానికి వెళ్తున్నా” చెప్పి అక్కడ్నించి కదిలాను.

“ఆల్బర్ట్ కి చెప్పావా వాషింగ్ టన్ వెళ్లిపోతున్నా అని?” వెనుక నుంచి అమ్మ అరుపు.

తనకేసి తిరిగాను.

“ఆల్బర్ట్ కూడా నీతోపాటే వస్తున్నాడుగా?” అంది.

“ఆల్బర్ట్ ఎవరు?” అన్నాను.

క్షణంసేపు మౌనంగా చూసి, “సరే వెళ్ళు” అంది అమ్మ.

నేను వచ్చేశాను.

మరుక్షణం త్వరత్వరగా రెడీ అయ్యి ఆల్బర్ట్ దృష్టిలో పడకుండా గెస్ట్ హౌస్ నుంచి ఎయిర్పోర్టు చేరుకున్నాను. ఫ్లయిట్ ఎక్కటం కోసం వెళ్తుంటే అప్పుడు వచ్చింది ఆల్బర్ట్ నుంచి మెసేజ్;

“హేయ్ మగ్..., వేర్ ఆర్ యు? రెండు గంటల నుంచి నిన్ను వెతుకుతుంటే దొరక్క ఇప్పుడే ఆంటీని అడిగాను. వాషింగ్ టన్ కి బయల్దేరావంట?... నాకు కనీసం చెప్పలేదు!?... వాట్స్ హ్యపనింగ్?” అని.

నేను రిప్లై ఇవ్వలేదు.

వెంటనే కాల్ చేశాడు. అటండ్ చేయకుండా సెల్ స్విచ్ ఆఫ్ చేశాను.

“నీకే కాదు ఆల్బర్ట్..., గేమ్స్ ఆడటం నాక్కూడా వచ్చు” అనుకుంటూ ఫ్లయిట్ ఎక్కాను.

ఫ్లయిట్ టేకాఫ్ అయింది.

గేమ్ స్టార్ట్స్!!..

******

Day – 1:

“మగ్..., నిన్న మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదు. లేచావా?... లేచాక పింగ్ చేయ్”

ఉదయం అలారం కన్నా ముందే ఆల్బర్ట్ నుంచి మెసేజ్ వచ్చింది. నేను రిప్లై ఇవ్వలేదు. లేచి ముఖం కడుక్కుని రాగానే అతడి నుంచే కాల్. కట్ చేసి సెల్ స్విచ్ ఆఫ్ చేశాను. చెవులకి ఇయర్ ఫోన్స్ తగిలించుకుని బిన్ బ్యాగ్ లో సెటిల్ అయ్యాను. ఎప్పుడో సగం చదివి వదిలేసిన బుక్ తెరిచాను.

‘పోయే పోయే... లవ్వే పోయే... పోతే పోయిందే... ఇట్స్ గాన్… ఇట్స్ గాన్… మై లవ్ ఈజ్ గాన్ గాన్ గాన్…’ ఇయర్ ఫోన్స్ లో ఆర్య-2 సినిమా సాంగ్ మోగుతూ ఉంది.

Day – 2:

రూమ్ లో - బ్రేక్ ఫాస్ట్ సమయంలో...

“సిస్..., ఆల్బర్ట్ వచ్చాడు..., నిన్ను రమ్మంటున్నాడు” తమ్ముడు వచ్చి చెప్పాడు.

“ఆల్బర్ట్ ఎవరో నాకు తెలీదన్నాను అని చెప్పు”

“యాజ్ ఇట్ ఈజ్ చెప్పేయమంటావా?”

“ఇంకొంచెం ఏమన్నా యాడ్ చేసి చెప్పాలనుకున్నా చెప్పుకో..., ఐ హావ్ నో ప్రాబ్లం”

“ఇక నాకు వదిలేయ్” అనేసి వెళ్లిపోయాడు ఆర్యన్.

తరువాత ఆర్యన్ ఐతే పైకి రాలేదు గాని ఆల్బర్ట్ నుంచి మెసేజ్ మాత్రం వచ్చింది. రిప్లై చేయలేదు. కాల్ వచ్చింది. ఎత్తలేదు. మళ్ళీ చెవులకి ఇయర్ ఫోన్స్ తగిలించుకున్నాను.

‘మగాళ్లు ఒట్టి మాయగాళ్ళే... ప్రేమంటే ఏమిటో తెలీదే... నట్టేట ముంచేసి పోతారే... వీడు కూడా ఇంతే...’ – ఈసారి చెవుల్లో మోగుతున్న పాట.

Day – 3:

మధ్యాహ్నం భోజనం సమయంలో...

“ఓయ్.. మగ్?... ఆర్ యు గాన్ మ్యాడ్? మెసేజ్ మి స్టూపిడ్!”

హుమ్మ్... మ్యాడ్!?... ఓకే, ఇంకా?

పట్టించుకోకుండా మళ్ళీ ఇయర్ ఫోన్స్ తగిలించాను.

‘ప్రేమ ఎంత మధురం... ప్రియురాలు అంత కఠినం’ ఈసారి వింటున్న పాట!!

Day – 4:

సాయంత్రం స్నాక్స్ సమయంలో...

“ఓయ్ మగ్..., మెసేజ్ మీ...”

“ఆర్ అట్లీస్ట్ కాల్ మి... ఆర్ లిఫ్ట్ మై కాల్...”

“ఐ యామ్ డైయింగ్ మగ్...”

ఆల్బర్ట్ నుంచి వరుసగా మూడు మెసేజ్ లు. ఆ తరువాత కాల్ కూడా. ఐతే దేనికీ రెస్పాండ్ అవ్వలేదు. అయ్యే ఉద్దేశం కూడా లేదు. ఇయర్ ఫోన్స్ తగిలించుకున్నాను.

ఈసారి పాట ఇంగ్లిష్ ది. లిరిక్స్ పట్టింపు లేదు. ఎమోషన్ చాలు!!

ఐతే విచిత్రంగా ఆ తరువాత ఆల్బర్ట్ నుంచి ఎలాంటి మెసేజ్ గాని కాల్ గాని లేదు.

నాకు అర్ధంకాలేదు..!!

Day – 7:

“మేఘనా..., స్టోర్ కి వెళ్ళి ఎగ్స్ తీసుకురా...”

అమ్మ అనటంతో ఎగ్స్ పర్చేస్ చేసి ఇంటికి తిరిగొస్తున్నాను. మది నిండా ఆల్బర్ట్ ఆలోచనలే. ఆల్బర్ట్ నుంచి లాస్ట్ మెసేజ్ మొన్న కాక అటు మొన్న వచ్చింది. దాని తరువాత అతని నించి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. ఎందుకు?..., నేను రిప్లై ఇవ్వటం లేదని తను కూడా ఇంక వదిలేసుకున్నాడా? మరీ ఎక్కువ బెట్టుగా ఉన్నానా? మరి అతడు మార్గరేట్ తో కలిసి నాతో ఆడిన డబుల్ గేమ్ సంగతి? అదే మాట్లాడి తేల్చుకోవాల్సిందా?... నా మనసులో పరిపరివిధాల ఆలోచనలు.

అలా ఆలోచిస్తూనే నడుస్తున్నాను. ఇంతలో వెనకనుంచి భుజం మీద ఎవరిదో ఆగంతకుడి చేయి. నేను ఉలిక్కిపడి వెనక్కి తిరిగేలోపే ఆ ఆగంతకుడు తన రెండో చేత్తో నా నోరు నోక్కెశాడు. ఎలా ప్రతిఘటించాలి అని ఆలోచించేలోపే నన్ను పక్కన చిన్న సందులోకి ఈడ్చుకెళ్ళాడు.

రాత్రి ఎనిమిదీ ముప్పావు అవుతుండటంతో రోడ్ మీద కూడా పెద్దగా జనాలు లేరు.

ఇదేనా నా చివరి రోజు?... అలానే ఉంది.

ఏదేమైనా శక్తిమేరకు ప్రతిఘటించాలి నిర్ణయించుకున్నాను. ఎప్పుడో తీసుకున్న సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్సెస్ ఇప్పుడు ఆచరణలోకి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. నేను సమాయత్తమయ్యేలోపే సందులోకి ఈడ్చుకెళ్లిన ఆ ఆగంతుకుడి పట్టు సడలినట్టుగా అనిపించి వెంటనే పొజిషన్ తీసుకున్నాను. వెనుకనుంచే మోచేత్తో అతడి డొక్కలో గుద్ది వేగంగా వెనక్కి తిరిగాను.

“ఔచ్!... ఈజీ మగ్.. నేనూ... ఆల్బర్ట్ ని” ఆల్బర్ట్ కంఠం.

స్ట్రీట్ లైట్ వెలుగులో ముఖం కనిపించింది. అవును ఆల్బర్టే! కానీ ఆల్బర్ట్ లా లేడు. ఏదో జబ్బుపడి నెలరోజులు హాస్పిటల్ లో ఉండి డైరెక్ట్ గా వచ్చినవాడిలా ఉన్నాడు.

“యు పంచడ్ మి మగ్...” రిబ్స్ మీద రుద్దుకుంటూ అన్నాడు.

“నువ్వేంటి?... ఇలా పేషెంట్ లా ఉన్నావ్?” అతడ్నే పరిశీలనగా చూస్తూ అన్నాను.

“మరి?... నువ్వు నాతో మాట్లాడకపోతే పేషెంట్ లా కాకుండా ఇంకెలా ఉంటాను?..” అన్నాడు.

నేను కనుబొమ్మలెగరేశాను.

“ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావ్?... ఫోన్ చేస్తే కట్ చేస్తావ్..., మెసేజస్ కి రిప్లై ఇవ్వవు..., ఇంటికొస్తే కలవ్వు... ఎందుకు ఇలా చేస్తున్నావ్?”

“ఎందుకో నీకు తెలీదా?”

“నాకెలా తెలుస్తుంది?”

“సరే తెలీకపోతే వదిలేయ్..” అనేసి అక్కడ్నించి కదిలబోయాను. చేయి పట్టుకు ఆపాడు ఆల్బర్ట్.

“స్టాండ్ హియర్ ఫర్ గాడ్స్ సేక్..., మగ్!” ఆపి అరిచాడు.

నేను నిలబడ్డాను.

“ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం మ్యామ్?” ఎక్కడ్నించి వచ్చాడో తెలీదు గాని ప్రత్యక్షమయ్యాడు సెక్యూరిటి కాప్.

“నాట్ ఎగ్జాట్లీ!” ఆల్బర్ట్ నే చూస్తూ అన్నాను.

ఏమనకున్నాడో ఏమో నన్నూ, ఆల్బర్ట్ నీ మార్చిమార్చి చూసి కొంచెం దూరం పక్కకి వెళ్ళి మమ్మల్నే చూస్తూ నించున్నాడు ఆ సెక్యూరిటి కాప్.

“చెప్పు?” అతడెల్లిపోగానే ఆల్బర్ట్ కేసి అన్నాను.

“నువ్వే చెప్పాలి..., ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావ్?” ఎదురు ప్రశ్నించాడు.

నేను మాట్లాడలేదు.

“మాట్లాడకుండా ఉంటే కుదరదు మగ్..., మాట్లాడాలి”

ఐనా మాట్లాడలేదు.

“మాట్లాడు మగ్..., నీ మౌనాన్ని నేను భరించలేకున్నాను. చూశావ్ గా..., ఫిట్ గా ఉండేవాడ్ని ఎలా ఇలా పేషెంట్ లా అయిపోయానో? నువ్వు ఇలానే ఉంటే ఉన్న ఆయుష్హు కూడా తీరిపోయి రేపోమాపో చచ్చిపోతాను కూడా... కానీ...” అంటున్న ఆల్బర్ట్ ని మాటల్ని మధ్యలోనే తుంచేశాను.

“నువ్వు కాదు ఆల్బర్ట్..., నేను.., నేను చచ్చిపోతాను. అసలు ఆల్రెడీ చచ్చిపోయి ఉండేదాన్ని కూడా నువ్వు ఆడిన డబుల్ గేమ్ కి” అరిచాను.

“డబుల్ గేమ్ ఏంటి?” నోరెళ్ళబెట్టాడు ఆల్బర్ట్.

“అవును..., డబుల్ గేమే...! నువ్వూ, మార్గరేట్ కలిసి ఆడుతున్న డబుల్ గేమ్”

“నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్ధం కావట్లేదు”

“అర్ధం కావట్లేదా?... సరే ఐతే చెప్తున్నా విను..., మనం ఆరోజు వాటర్ ఫాల్స్ కి వెళ్ళి వచ్చిన తరువాత రాత్రి మార్గరేట్ తో నువ్వు చేసిన వాట్సాప్ కాన్వర్సేషన్ చూసుకో... అప్పుడు అర్ధమవుతుంది”

“నువ్వు ఆ కాన్వర్సేషన్ చదివావా?”

“చదివాకేగా మీరు ఆడుతున్న గేమ్ గురించి నాకు తెలిసింది”

“అలా పరుల మెసేజస్ చూడటం తప్పు కదా మగ్?...” తప్పొప్పులు గురించి ఎత్తాడు ఆల్బర్ట్.

నాకు మండిపోయింది.

“నీ...” అంటూ అక్కడ్నించి మళ్ళీ కదిలాను. మళ్ళీ చేయి పట్టుకున్నాడు ఆల్బర్ట్.

“వదులు...”

“వెళ్లిపోతావేంటి మాట్లాడుతుంటే?” చేతిని వదల్లేదు.

“చేయి వదులు. లేకపోతే కాప్ ని పిలుస్తా” కాప్ కేసి చూస్తూ అన్నాను.

ఆ సెక్యూరిటి కాప్ మావైపే చూస్తూ ఉన్నాడు. ఆల్బర్ట్ చేయి వదిలేశాడు.

“ఇప్పుడు తెలిసిందిగా నా మౌనానికి కారణం?.. ఐ యామ్ గోయింగ్” అక్కడినించి కదులుతూ అన్నాను.

“నేను నీకు మెసేజ్ చేస్తాను మగ్..., ఐ కన్ ఎక్స్ప్లేన్ యు ఎవ్రీథింగ్” వెనుకనుంచి వస్తున్న ఆల్బర్ట్ మాటల్ని పట్టించుకోకుండా వేగంగా వెళ్లిపోయాను.

ఇల్లు చేరుకున్నాను.

నేను ఇల్లు చేరగానే వచ్చింది ఆల్బర్ట్ నుంచి మెసేజ్ – “మగ్..., మొత్తం మెసేజ్ ద్వారా ఎక్స్ప్లేన్ చేద్దాం అనుకున్నాను. కానీ దానికి చాలా టైప్ చేయాల్సి వస్తుంది. నాకంత ఓపిక లేదు మగ్. ఒక్కసారి నువ్వు రేపు మా ఇంటికి రా మగ్. వన్స్ ఫర్ అల్..., అంతా ఎక్స్ప్లేన్ చేస్తా. ప్లీజ్ మగ్..., ఒక్కసారి రా. ఇట్స్ మై రిక్వస్ట్. కానీ ఒకటి మాత్రం చెప్పగలను..., ఇప్పుడు మార్గరేట్, నేనూ ఎలాంటి రిలేషన్ షిప్ లో లేము. అది మాత్రం ప్రామిస్ గా చెప్తా. ఒక్కసారి రేపు రా మగ్. మిగితాది మాట్లాడుకుందాం. వస్తావ్ కదూ?..” అని మెసేజ్ పెట్టాడు.

ఆల్బర్ట్ మెసేజ్ చూడగానే నవ్వొచ్చింది. అతడూ, మార్గరేట్ ఎలాంటి రిలేషన్ లో లేరని ఆరోజు వాళ్ళ వాట్సాప్ మెసేజస్ చూసినప్పుడే అర్ధమైంది. ఈరోజు ఆల్బర్ట్ వాలకం చూశాక ఇంకోటి కూడా అర్ధమైంది. ఆల్బర్ట్ కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. లేకపోతే ఎందుకు అలా పేషెంట్ లా తయారవుతాడు?... కానీ తెలియాల్సిందల్లా ఎందుకు మార్గరేట్ తో కలిసి నాతో గేమ్ ఆడాడని?! ఎందుకు నా ప్రేమ ఎరగనట్టు నటించాడు అని?! తెలియాలంటే రేపు ఆల్బర్ట్ ఇంటికి వెళ్ళాలి. ఏదేమైనా ఈసారి అతడు ప్రపోజ్ చేసేదాకా ఆగాలి తప్ప నేను చేయను. ఒకవేళ..., ప్రపోజ్ చేయటానికే రేపు నన్ను ఇంటికి రమ్మంటున్నాడేమో?... ఆలోచన రాగానే గాల్లో తేలుతున్న భావన.

“ఓకే..., ఐ యామ్ కమింగ్” అని రిప్లై మెసేజ్ పెట్టాను.

మెసేజ్ పెట్టి లేచి వార్డ్ బోర్డు తెరిచాను. రేపు ఆల్బర్ట్ మతిపోయేలా తయారయ్యి వెళ్ళాలి. ఏం డ్రస్ వేసుకోవాలి?... ఆలోచనగా నా దృష్టి హ్యాంగర్ కి తగిలించిన శారీ కేసి నిలిచింది.



Rate this content
Log in

Similar telugu story from Drama