Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Soudamini Soudamini

Inspirational

4.9  

Soudamini Soudamini

Inspirational

రాజి విరమణ

రాజి విరమణ

5 mins
1.8K


ఫోన్ లో వీడియో గేమ్ చప్పుడికి నిద్ర లేచింది రాజి. మంచం పక్కన కూర్చుని వాళ్ళ అబ్బాయి నాని వీడియొ గేమ్ ఆడుతున్నాడు. “వేసవి సెలవల్లో కూడా పడుకోకుండా పొద్దున్నే ఈ గేమ్స్ ఏంటి నాన్నా” అని కొప్పడింది. అంతే నాని ఫోన్ వదిలేసి పడుకున్నాడు. నిజానికి రాజి కి రాత్రి చాలా సేపు వరకు నిద్ర పట్టలేదు - ఈ రోజు తాను తీసుకోబోయే నిర్ణయం సరి అయినదా కాదా అని రాత్రి అంతా బాగా ఆలోచించింది. టైమ్ చూసింది. ఉదయం ఏడు గంటలు. మెట్లు దిగి హల్లో కి వెళ్ళి “అలెక్సా, ప్లే మొహమ్మద్ సాంగ్స్” అంది. “జో వాదా కియా ..” పాట వస్తోంది. తన యోగా పూర్తి చేసి ఆఫీసు కి రెడీ అయ్యింది. అప్పుడే లేచి కిందకి వచ్చిన రాజి భర్త రవి అన్నాడు “నేను ఈ రోజు ఇంట్లోనే పని చేసుకుంటాను లే, నువ్వు వెళ్ళి రా, ఆల్ ది బెస్ట్ ”. రాజి క్యాబ్ ఎక్కగానే “ఎక్కడికి?” అని అడిగాడు డ్రైవరు. “అమెజాన్ ఆఫీస్”  అని చెప్పింది రాజి.


క్యాబ్ మొదలు కాగానే గతం గురించిన ఆలోచనల లోనికి వెళ్లి పోయింది. రాజి వాళ్ళది మధ్య తరగతి కుటుంబం. తాను ఒక్కత్తే కూతురు. అమ్మ పెద్దగా చదువుకోలేదు కాబట్టి  రాజి ని బాగా చదివించాలనుకుంది.  నాన్న గారు ఇంజనీరింగ్ చదువుతుండగా ఆకస్మికం గా చనిపోయారు. ఒక సారి జీవితం తలకిందులు అయినట్లు అనిపించింది. దాని నుండి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది.


తరువాత నెల లోనే క్యాంపస్ ప్లేస్మెంట్స్ . అమెజాన్ మొదటి కంపెనీ. తాము ఉన్న ఆర్ధిక పరిస్థితికి అది ఎంతో అవసరం. నాలుగు ఇంటర్వ్యూ ల తరువాత సెలెక్ట్ అయిన ఇద్దరిలో తను కూడా ఉంది. అప్పుడు అమ్మ ముఖం లో గర్వం చూసి  తనకు కలిగిన సంతృప్తి మరిచిపోలేనిది. ఈ ఉరకలు పరుగుల జీవితం లో అలా ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి.


ఇంతలో ఫోన్ మ్రోగిన శబ్దానికి ఆలోచనల లో నుండి బయటకు వచ్చింది. ఫోన్ చెక్ చేసి కంగారు పడింది. తమ అప్లికేషన్  ఆగిపోయినట్లు  మెసేజ్ వచ్చింది.  ల్యాప్టాప్ కి వైఫై కనెక్ట్ చేసి టీం తో మాట్లాడింది. ప్రోగ్రామ్ లో ఏమి మార్పులు చేయాలో, ఎలా చెయ్యాలో సూచనలు ఇచ్చింది. డ్రైవరు మరొక పది నిమిషాలలో ఆమెని ఆఫీసు కి చేర్చాడు. క్యాబ్ దిగి త్వరగా వెళ్లబోతున్న రాజి తో అన్నాడు “మేడమ్, నా ఫైవ్ స్టార్ రేటింగ్” అని. అంత ఒత్తిడి లోనూ తనకు నవ్వు వచ్చింది. “అలాగే” అంది. తరువాతి అరగంట లో మళ్ళీ అప్లికేషన్ పని చెయ్యడం మొదలు పెట్టింది. ఊపిరి పీల్చుకుంది.


అప్పుడే రాజి ప్రాణ స్నేహితురాలు సరోజ ఆఫీసు రూం లోనికి వచ్చింది. "హే రాజి, ఇంతకీ ఏం నిర్ణయించుకున్నావు ?" అంది. "నా నిర్ణయం ఏమీ మారలేదు " అంది రాజీ ప్రశాంతం గా. "నీది ఏమైనా తక్కువ జీతమా నెలకు ఎన్నో లక్షలు. అంత వదిలేసి ఉండగలవా" అని ఆశ్చర్యం గా అంది సరోజ. "నీకు ఇదివరకే చెప్పాను కదా మనకి బ్రతకడానికి డబ్బులు కావాలి కానీ డబ్బు సంపాదించటం కోసమే బ్రతకక్కర్లేదని" అంది రాజి. "ఏదో నువ్వూ నీ వేదాంతం కానీ నువ్వు ఇక్కడి దాకా రావడానికి ఎంత కష్ట పడ్డావో నాకు తెలుసు కదా. నువ్వు క్రొత్త తరం వారందరికీ ఒక స్ఫూర్తి. ఒక సారి ఆలోచించుకో" అంది. "అందుకే కదా నా మీద ఇంకా ఎక్కువ బాధ్యత వుంది " అంది రాజి. "సరే నీ ఇష్టం, ఆల్ ది బెస్ట్" అని చెప్పి వెళ్ళిపోయింది సరోజ నిర్లిప్తం గా.

ఇంతలో ఇంటి నించి వీడియోకాల్.  అవతల నిండి వాళ్ళ అబ్బాయి నాని. “అమ్మా, ఫ్రిజ్ లో ఐస్ క్రీమ్ తినచ్చా” అని. రాజి కి వస్తున్న నవ్వుని ఆపుకుని అంది “ఒక్క కప్పు మాత్రమే, అది కూడా డాడీ ని అడిగి. ఎక్కువ తింటే ఏమవుతుందో, నీకు తెలుసు కదా” అని కొంచెం కఠినం గా అంది. “సరే అమ్మా”అని ఫోన్ కట్ చేశాడు.  

రాజి క్రింద పని చేసే ఐశ్వర్య ఆఫీసు బయట వేచి ఉన్నట్లు చూసింది. “లోపలికి రా, ఐశ్వర్యా” అంది. కుర్చీ లో కూర్చుని "మేడమ్, వచ్చే ఆరు నెలల్లో ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉందా." కొంచెం సంశయం గా అంది ఐశ్వర్య.  “ నీ అప్లికేషన్స్ లో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి". అని చెప్పింది ఖచ్చితం గా రాజి. “ఇంక నుండి అప్లికేషన్ లో క్రొత్త సమస్యలు రాకుండా ముందు చూపు తో చూసుకునే బాధ్యత నీది” అని మెత్తగా చెప్పింది.

“అలాగే మేడమ్, తప్పకుండా. నా ఐడియా లన్నీ ఈ డాక్యుమెంట్ లో రాశాను. ఒక సారి మీరు పరిశీలిస్తే బాగుంటుంది” అంది ఐశ్వర్య.

ఇరవై నిమిషాల సంభాషణ తరువాత ఇద్దరు కలిసి కాంటీన్ కి వెళ్లారు.


"ఇంట్లో ఏమిటి విశేషాలు, ఇంతకీ మీ ప్రేమ  ఎంత వరకు వచ్చింది?" అడిగింది రాజి.

"మీకు తెలియనిది ఏముంది మేడమ్ , మా ఇద్దరికీ పెళ్లి ఓకే నే కానీ వాళ్ళ ఇంట్లో పెళ్లి ఖర్చులకి ఇరవై లక్షలు కట్నం అడుగుతున్నారు , అక్కడే ఇబ్బంది" అంది ఐశ్వర్య ఒకింత బాధగా. 

"ఓహ్ , మరి రాహుల్ ఏమంటున్నాడు?" అడిగినది రాజి.

"రాహుల్ కి ఇష్టం లేదు, కానీ ఇంట్లోవాళ్ళకి సర్ది చెప్పే ధైర్యం లేదు. అప్పు తీసుకుందాం, పెళ్లి అయిన తరువాత కలిసి తీర్చుకుందాం అంటున్నాడు " అంది ఐశ్వర్య విచారం గా .

"ఈ సమస్యని   సామరస్యం గా  పరిష్కరించాలి కానీ దాని నించి పారిపోతే ఎలాగ? “పెళ్ళికి ఎంత ఖర్చు చేయాలో మీరు బేరీజు వేసుకుని ఇంట్లో వారికి నచ్చ చెప్తే మంచిది" అని సలహా ఇచ్చింది రాజి.

"అదే మేడమ్, మీరు సరిగ్గానే చెప్పారు,” అంది ఐశ్వర్య. ఇంతలో ఐశ్వర్య ఫోన్ మ్రోగింది. “ఒక నిమిషం” అని పక్కకు వెళ్ళింది.


రాజి తాను ఒక సారి గతం లోనికి వెళ్ళింది. ఆఫీసు లో జాయిన్ అయిన కొత్తల్లో రవి తన కొలీగ్, సీనియర్. రవి తెలివితేటలు, అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వడం తనకి నచ్చేది. మొదటి రెండు సంవత్సరాలు ఆఫీసు విషయాలు తప్ప పర్సనల్ విషయాలు ఎప్పడూ మాట్లాడుకునేవారు కాదు. ఒక సారి ఆఫీసు తరఫున ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు ఇద్దరు కలసి ఒకే విమానం లో ప్రయాణించారు. ఇంటర్వ్యూ అయిపోయాక తిరుగు ప్రయాణం లో విమమనాశ్రయం లో తన మనసులోని మాటను బయట పెట్టాడు “నన్ను మా ఇంట్లో వాళ్ళు కూడా భార్య పోస్ట్ కోసం ఇంటర్వ్యూ చేయమంటున్నారు, మీరు ఏమంటారు, చేయనా వద్దా ”.

ఒక నిమిషం రాజీ కి ఏమి చెప్పాలో అర్థం కాలేదు. “ఇంటర్వ్యూ చేస్తేనే కదా మీకు కావలసిన అమ్మాయి దొరకేది ” తడబడుతూ అంది.

“కానీ, ఇది ఏమైనా జాబ్ ఇంటర్వ్యూ నా, ఆ అమ్మాయికి కూడా నేను నచ్చాలి కదా, ఒకరి మీద మరొకరికి గౌరవం వుండాలి కదా,” అని ఒక నిమిషం ఆగి మళ్ళీ అన్నాడు “ఇంతకీ మీరు చెప్పండి, మీకు నా మీద గౌరవం వుందా ” . 

ఒక నిమిషం ఆలోచించి “ఇలా అడిగినందుకు మీ మీద గౌరవం ఇంకా పెరిగింది” అంది రాజి నవ్వుతూ.

“ఇంకేముంది, అయితే ఇంటర్వ్యూ లు కాన్సెల్ చేయమంటారు” అన్నాడు రవి నవ్వుతూ.

తరువాత ఇరు వైపులా పెద్దల అంగీకారం తో నెల రోజులకి పెళ్లి జరిగింది. ఏ మాట కి ఆ మాట - రవి గాని, వాళ్ళ ఇంట్లో వాళ్ళు గాని తనని కట్నం కోసం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. కానీ ఆ ప్రోత్సాహం లేని వాళ్ళు ఎందరో కదా అనుకొంది.

 “సారీ మేడమ్ , రాహుల్ నించి ఫోన్” అని ఐశ్వర్య చెప్పడం తో ఒక సారి ఉలిక్కిపడి మళ్ళీ వర్తమానం లోనికి వచ్చింది రాజీ. తన మీటింగ్ కి టైమ్ అయ్యింది.

“లోపలికి రావచ్చా “ అంది రాజీ. “రండి, రండి ” అన్నాడు రాజి బాస్ రమణ. సర్, నేను ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను. దీని కోసం గత ఆరు నెలల నిండి బాగా ఆలోచించాను. ఇదే సరి అయిన నిర్ణయం అనిపించింది” అంది రాజి. “ఏమిటి అది అన్నాడు” ప్రశ్నార్ధకం గా. “దీనిని రాజీనామా అనాలో లేక విరమణ అనాలో తెలియదు కానీ నేను ఉద్యోగానికి సెలవు తీసుకుందాము అనుకుంటున్నాను ” అంది నెమ్మదిగా చెప్పింది రాజి. “వాట్, ఎందుకు !” అన్నాడు రమణ ఒక్క సారిగా.

“సర్, ఈ కార్పొరేట్ ట్రైనింగ్స్ నించి మేము ఎంతో నేర్చుకున్నాం - ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం, దాని కోసం ప్రణాళిక వేసుకుని కష్టపడటం. అలాగే ఒక సమస్య వచ్చినప్పుడు, దానిని విశ్లేషణ చేసి పరిష్కరిచడం నేర్చుకున్నాము. ఇవే నైపుణ్యాలని వాడితే మన దేశం లో ఎన్నో ముఖ్యమైన సమస్యలు పరిష్కరించవచ్చు, దాని వలన నాకు ఇంకా ఎక్కువ తృప్తి కలుగుతుందని నా అభిప్రాయం.”

“మా ఆర్థిక స్థితి కి ఇప్పటి దాకా సంపాదించిన దానితో జీవితాంతం మా అవసరాలకు గడిపేయవచ్చు. అవసరాలకు మించి ఎంత సంపాదించినా తృప్తి వుండదు. ఒక పక్క ఆర్థిక స్వాతంత్ర్యం లేక, రోజువారీ అవసరాలకి డబ్బు సరిపోక బాధ పడుతున్న వాళ్ళు ఎందరో వున్నారు, ముఖ్యం గా ఆడ వాళ్ళు. వాళ్ళ ఆర్ధిక స్తోమత పెంచితే ఎన్నో కుటుంబాలు బాగు పడతాయి. అందుకే వారికి ఆర్ధిక సామర్ధ్యాన్ని పెంచడానికి కావలసిన నైపుణ్యాలు పెంచడానికి, ఇంకా ఆ డబ్బులని ప్రణాళికా బద్ధం గా పొదుపు చేయడం నేర్పడానికి కృషి చేయాలన్నది నా ఆశ, కోరిక, అందుకే కాలేజీ స్టూడెంట్స్ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక ఎన్.జి.ఓ స్థాపిస్తున్నాను.” అని ఒక నిమిషం ఆగింది.

“దీని కోసం మీరు ఉద్యోగం ఎందుకు మానెయ్యటం. అవసరం వున్న వాళ్ళకి డబ్బులు పెట్టుబడి ఇచ్చి ఆర్థిక అవసరాలు తీరిస్తే సరిపోతుంది కదా” అడిగాడు రమణ.

“సర్, మనం వారి అవసారాలని కొంత వరకే తీర్చగలం, అదే వారి కి సంపాదించుకునే నైపుణ్యాలను ఇస్తే వారి జీవితాన్ని వారే సరి దిద్దుకోగలరు. మీకు తెలియనిది కాదు, ఇదే ఫార్ములా మన స్వంత పిల్లలకు కూడా వర్తిస్తుంది” ఒక్క సారి మనసు లోని భారం అంతా దిగిపోయినట్లు అనిపించింది రాజి కి.

“మీ ఈ మంచి ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను ” అన్నాడు రమణ సౌమ్యం గా. “మీకు అల్ ది బెస్ట్ , బట్ వి మిస్ యు” ఆన్నాడు రాజీ పడ్డ రమణ.

 

 


Rate this content
Log in

Similar telugu story from Inspirational