Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

sudha Atreyaa

Inspirational

4.6  

sudha Atreyaa

Inspirational

చేతన పొందిన స్పందన

చేతన పొందిన స్పందన

7 mins
772


చేతన పొందిన స్పందన


"ఒరే శ్యాము!! రెండు నెలల తర్వాత అక్క వస్తోందిరా. అక్కకు ఇష్టమైన పూలు తెమ్మన్నా తెచ్చావా"... వంటింట్లో నుంచే కొడుకును అడిగింది శారద. 


"అమ్మా!!! ఏంటి చాదస్తం. ఇప్పటికి మూడుసార్లు ఆడిగావు చెప్పాను" కాస్త విస్సుకొని బదులిచ్చాడు శారద కొడుకు శ్యాం .


"అవునురా!! ఏమి చేయమంటావు నా బంగారు తల్లి మునపటిలా అవుతుందనుకోలేదు. అంత అచేతనంగా స్పందనని ఎప్పుడూ చూడలేదు" అంది శారద కొడుకు తెచ్చిన పూలను అందుకుంటూ 


"మరి నిజమే!! కదమ్మా అక్క కు జరిగిన అన్యాయం చిన్నదా చెప్పు" కాస్త బాధతో అన్నాడు శ్యాం .


"అవునురా ఏ ఆడపిల్లకి జరగకూడని అన్యాయం. ఇప్పటికి ఆ రోజును మరచిపోలేనురా" అని కన్నీటి పర్యంతం అయ్యింది శారద. .


"అమ్మ!! మళ్ళీ ఎందుకు తలుచుకుంటావు. వదిలేయ్ అక్క మనకు దక్కింది అదిచాలు" అని తల్లి ఓదారుస్తూ అన్నాడు శ్యాం .


"నిజమే కానీ!! అయినా అది ఎలా మరచిపోతానురా. హాస్పిటల్లో తను ఎంత అచేతనంగా!! ఒళ్ళంతా గాయాలతో... త్రాస్టుడు ఎంత పైశాచికంగా దాన్ని రేప్ చేశాడు కదరా! ఎలా మరచిపోతాను!!. శరీరానికి అయిన గాయాలు తగ్గి ఇంటికి వచ్చిన అక్క!! రాత్రిళ్ళు తన కలవరింతల్లోని గుండెగాయాన్ని ఎలా మరిచేదిరా!!. చిరు స్పర్శకె చిగురుంటాకులా వణికిపోతున్న స్పందనను గుండెకు ఎలా హత్తుకొని ఓదార్చాలో తెలియక ఈ తల్లి మనసు పద్దవేదనను ఎలా మర్చిపోతానురా"...వస్తున్నా దుఃఖాన్ని అతికష్టం మీద ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ అంది శారద. 


"నాకు తెలుసమ్మా ఇది మారుపుకురానిదని!! అక్క కోలుకుని ఇప్పుడే బెంగళూరు ఆశ్రమం నుంచి వస్తోంది. నీవు పొరపాటున మళ్ళీ గుర్తుచేసావనుకో!!!... ఎందుకు చెప్పు" అని తల్లిని ఓదార్చాడు శ్యాం. 


"నిజమేరా ఎంత అచేతనంగా వునింది తను . కేవలం రెండునెలల్లో వారు తనలో ఎంత మార్పు తెచ్చారు. ఆ ఆశ్రమం వారికి చేతులెత్తి మొక్కాలి. నీతో మాట్లాడుతూవుంటే నాకు లేట్ అయిపోతుంది, వంటింట్లో నాకు ఇంకా చాల పనుంది "అని చెప్పి వెళ్ళిపోయింది స్పందన తల్లి శారద..


"అమ్మ!!!" అని గట్టిగా పిలిచాడు శ్యాము


"ఏమైందిరా అంత గట్టిగా పిలిచావు హడలి చచ్చాను. నీ అరుపుకి గుండె ఆగిందనుకో" అని రొప్పుతూ వంటింట్లోనుంచి హల్లోకి వస్తూ అడిగింది శారద .


""అమ్మ!! ఒకసారి అటు టీవీ చూడు" అని కంగారుగా, ఒకింత భయంతో అన్నాడు శ్యాం. 

శారద టీవీ చూస్తూ స్థాణువుగా నిలబడిపోయింది.

టీవీలో స్పందన... టీవీ న్యూస్ చాన్నళ్లకు ఇంటర్వ్యూ ఇస్తోంది పోలీస్ స్టేషన్ బయట. తనకు జరిగిన అన్యాయం, తనను రేప్ చేసినవాడి గురించి నిర్భయంగా చెబుతోంది. 

అంతా విన్న శారద నిస్సత్తువ ఆవహించి సోఫాలో కూలబడిపోయింది. కాసేపటికి కన్నీళ్ల పర్యంతమౌవుతు కొడుకు భుజం పై తల వాల్చి 

"శ్యాము!!! ఏదైతే జరగకూడనుకున్నానో అదే జరిగింది కదరా. ఇప్పుడు అందరి కళ్ళు మనవైపే కదా. ఎన్ని సూటిపోటి మాటలు పడాలి. అసలు దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు. దీని భవిష్యత్తు ఏమిటిరా!!. ఎదో!! గాయం కొద్దిగా సమసిపోయాక ఏ రెండో పెళ్ళివాడికి ఇచ్చి పెళ్లిచేసి దీని జీవితానికి ఒక భద్రత కల్పించాలని నేను అనుకుంటే!! అదేమో తనచేతులతోనే తన జీవితాన్ని పాడుచేసుకుంటోంది కదరా!!!. మేము బ్రతికున్నంతవరకు సరే తర్వాత ఏ తోడు నీడ లేక ఒంటరి నీడగా మిగిలిపోతుందేమో రా!!!... అని దుఖాన్ని ఆపుకోలేకపోయింది శారద.


"అమ్మ అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు అలాంటిది ఏమిలేదు" అని తన తల్లి ని చిన్న పిల్ల లాగ చుట్టుకొని గోముగా అంది స్పందన. 


తన రాక గమనించని శారద తన కూతురు తన మాటలకు మళ్ళి ఎక్కడ కుంగిపోతుందో అని లోలోపల నొచ్చుకుంటూ స్పందనను గట్టిగా హత్తుకుంది. కుసల ప్రశ్నలు భోజనాలు అయ్యాక ఆడగూడదు అని అనుకుంటూనే వచ్చినప్పటినుండి ఎడతెరిపిలేని పరామర్శలు విమర్శలు బెదిరింపులతో బాగా భయడ్డ శారద తన కూతురి పక్కన కూర్చుంటూ తనకు వత్తాసు పలికేందుకు కొడుకుని కూడా పక్కన కూర్చుండబెట్టుకుంది .


"స్పందన నీవు ఏమీ అనుకోకపోతే ఒకమాట అడగనా" అని స్పందనను తన ఒడిలో పడుకోబెట్టుకుంటూ మార్దవంగా అడిగింది శారద . 


"ఒకటేంటి అమ్మ!! వంద అడుగు. ఒక్క నిముషం ఈ ఫోన్, టీవీ మ్యూట్ పెడతాను" అని వాటిని మ్యూట్ చేసి తల్లిఒడిలో చిన్న పిల్లలా ఒదిగి పడుకొని అడిగింది స్పందన . . 


" చూడరా స్పందన!! పోద్దటినుండి ఇప్పటివరకు ఓ వందసార్లు చూపించి వుంటారు టీవిలో నీ ఇంటర్వ్యూ. వారికీ ఇదో విందు భోజనం ... అయినా నీవు ఎందుకిలా చేసావు. నేను నీ భవిషత్తు గురించి ఎన్నో కలలు కన్నాను. దయలేని భగవంతుడు దాన్ని ఛిద్రం చేసాడు. సరే!! ఉప్పెనొచ్చి స్వర్గాన్ని నరకంగా చేసింది. తప్పదు జీవితం సాగాలి.... ఎదో!! నీవు కోలుకున్నావు ఇంకొద్దిగా కోలుకొని ఏ బ్యాంకు ఉద్యోగమో తెచ్చుకుంటే ఎదో ఒక తోడును కల్పించాలని అనుకున్నా . నాలుగు గోడల మధ్య ఉండాల్సినదాన్ని ఎందుకు నలుగురిలోకి తీసుకెళ్ళావు. నలుగురి కంట్లోపడం ఇంకా చేటే కానీ ఏం మేలు చేస్తుంది. ఎందుకు ఇంటికి రాకుండా సరాసరి పోలీస్ స్టేషన్కు వెళ్ళావు. మీ నాన్న కూడా వత్తాసు పలకడం నాకు అస్సలు నచ్చలేదు. వాళ్ళు బలవంతులు వారిని ఢీకొనడం సాధ్యమా చెప్పు" అని గుక్కతిప్పుకోకుండా తన భాధన్నంతా వెళ్లగక్కింది శారద


"నిజమే అమ్మ నేను నీలాగే ఇది నాలుగు గోడల మధ్య ఉండాల్సిన విషయమే అని నమ్మాను. నేను ఇలా మారడానికి జరిగిన విషయాలన్ని చెప్తాను విను" అని తల్లి ఒడిలోనుంచి లేచి తల్లి పాదాల దగ్గర క్రింద కూర్చుని శారదను చూస్తూ జరిగిన విషయాలు చెప్పటం మొదలు పెట్టింది స్పందన.


శారద, శ్యాం ఇద్దరు తనేమి మీ చెప్తుందోనని ఆత్రంగా వినడానికి అన్నట్టు తననే చూస్తూ వున్నారు.


"" అమ్మ!! dr విమల గారు నన్ను చాలా మంచి రీహాబిలిటేషన్ సెంటర్కు పంపారు. అక్కడ వారి మానసిక చికిత్స ఎంత బాగుందంటే నేనసలు కోలుకోగలనా!! అనుకున్న నేను చాల త్వరగా కోలుకున్న. వారి చికిత్స కేవలం కోలుకోవడం వరకే కాదు మానసికంగా మనల్ని దృఢంగా చేయటం.. ఒక రోజు నాకు వైద్యం చేసే dr.శ్రీకర్ గారు నన్ను తన గదికి పిల్చారు. పిల్చి ... 


"అమ్మ స్పందన నీ ట్రీట్మెంట్ దాదాపు పూర్తి అయ్యింది. చాల పెద్ద కష్టం వచ్చింది. అనుకున్నదానికంటే త్వరగానే కోలుకున్నావు. నీవు కాక వేరే ఉండివుంటే చాల సమయం పట్టేది" అని నన్ను చాల మెచ్చుకున్నారు. 


"థాంక్యూ సర్" అని చెప్పి మరి నేను ఇంటికి ఎప్పుడు వెళ్ళవచ్చు" అని అడిగాను 


"మరి ఇంటికెళ్ళాక నీ భవిషత్తును ఎలా తీర్చి దిద్దుకోవాలనుకుంటున్నావు" అని అడిగారు ఆయన . 


"తెలియదు సర్. అమ్మ నాన్న ఏది డిసైడ్ చేస్తే అదే " అని చెప్పాను


" మరి వారి మీద పోలీస్ కంప్లైన్ట్ ఇవ్వాలని ఏమి అనుకోలేదా" అని అడిగారు


"వారు మాకన్నా చాల బలవంతులు. వారిని ఎదురుకోవడం సామాన్యులమైన మాకు చేత కాదు కదా సర్" అని నా నిస్సహాయతను తెలిపాను . 


" అంటే వారిని క్షమించేస్తావా" అని కాసంత కటువుగా అడిగారు . 


"ఎప్పటికి క్షమించను. కానీ నిస్సహాయురాలిని" తలొంచుకొని బదులిచ్చాను. . 


"అలా అనుకుంటే ఎలా. మొదటి అడుగు ఎప్పుడూ వంటరి తర్వాత చాల అడుగులు కలుస్తాయి. ఇప్పుడు సమాజం లో చాల మార్పు వచ్చింది. అప్పటిలా హేళనగా చేసేవారి సంఖ్య తగ్గింది. వారికి శిక్ష పడాలి కదా. అలా వదిలేస్తే వారిని నీవు క్షమించినట్టేకదా" నా వైపు కొద్దిగా కోపంగా చూస్తూ అడిగారు డాక్టర్ గారు. 


"ఏమో సర్!! అది నాకు తెలియదు. మేము మధ్యతరగతి వారము" అని ఇంకేం చెప్పాలో అర్థం కాక వూరుకుండిపోయా .


"సరే నీ ఇష్టం. రేపు తొమ్మిదింటికి సిద్ధంగావుండు. మన ట్రీట్మెంట్లో భాగంగా మన హాస్పిటల్ అనుబంధ ఆశ్రమానికి వెళ్తున్నాము" చెప్పి ఇంకేమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. 


నేను మరుసటి రోజు తోమిదింటికెల్లా సిద్ధంగావున్నాను. నన్ను సార్ రమ్మంటున్నారు అని నర్సు వచ్చి చెప్పటంతో సార్ దగ్గరకు వెళ్ళాను. అప్పటికే సార్ బయలుదేరడానికి సిద్ధంగా వున్నారు. నన్ను... ఇంకో ఇద్దరిని మరి వారు ఎందుకు ఇక్కడ చేరారో నాకు తెలియదు. మొత్తం నలుగురం సార్ కారులో మా ఆశ్రమానికి అనుభందంగా వుండే ఇంకో ఆశ్రమం కు పిల్చుకెళ్లారు. నిజానికి మాది చికిత్సాలయం ఇప్పుడు మేము వెళ్తున్నది ఎదో మహిళా వసతి ఆశ్రమం. 


"ఇదే స్పందన ఆ ఆశ్రమం ఇందులో మేము హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మనుషుల అక్రమ రవాణా బారినుండి కాపాడబడ్డవాళ్ళ వసతి గృహం. సొంత వాళ్ళు కాదంటే ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని స్త్రీలకు ఇక్కడ వసతి కల్పిస్తాము. వారు వారి కాళ్లపై నిల్చునెంత వరకు వారిని అన్ని విధాలా ఆదుకుంటాము. . అదిగో చూడు వీరంతా ఒంటరి నీడలే ఆదరించే దిక్కు లేక ఎటుపోవాలో తెలియక ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో చాలామంది రేప్ బాధితులే. 


అదిగో అక్కడ వున్న నలుగురిని ఒక్కడే ఛిద్రం చేసాడు . మొదటిసారి తప్పు చేసినప్పుడు పరువుకు పోకుండా పెదవి విప్పివుంటే కనీసం మిగితావారన్నా వాడి బారి నుంచి కాపాడపడేవారు. నీలాగే భాధను కడుపున దాచుకున్నారు. ఆ బాధలో మరొకరికి చేరువయ్యారు వాడు అమ్మబోతే ఇలా ఇక్కడ వుంటున్నారు. మిగితా వారిది ఇంచుమించు ఇదే పరిస్థితి. ఇక్కడకు వచ్చాకే వారి బ్రతుకుతో ఆడుకున్నది ఒకడేనని తెలిసింది. అందరు ఒక ఊరి వాళ్ళే కానీ ఒకరికొకరు తెలియదు. వీళ్లల్లో ఒక్కరైనా ధైర్యం చేసుంటే వాడు భయపడేవాడో లేక వాడిచేతిలో మోసపోకుండ రక్షించుకొనేవాళ్ళో!! కానీ!! భయం , పరువు, కుటుంబం .... దేవుడికి భయం వేసి వాడిని తీసుకెళ్లాడు లేకపోతె ఇంకెన్ని జీవితాలు ఛిద్రం అయ్యేవో. ప్రతిసారి ఇలా జరగదు మనం కూడా మనవంతుగా దుర్మార్గులను ఏరి వేయటం చేయాలి. అప్పుడే మనం కూడా సమాజానికి ఏదో కొంతైన ఉపకారం చేసినవాళ్ళము అవుతాము. సమాజానికి మంచి చేయటం ఎంత అవసరమో దుర్మార్గులను శిక్షించడం కూడా అంతే అవసరం. భారతం లో కృష్ణుడు అదే చెప్పాడు. దుష్ట శిక్షణ చాల అవసరం.. . ఇక్కడ అందరూ అభాగ్యులు . చూడమ్మా స్పందన వీరు చదువుకోలేదు తమవైపు బలంగా నిలబడే కుటుంబం లేదు. కానీ నీవు చదువుకున్న్నావు తెలివైనదానివి. పోరాడితే తప్పేమిటి. బలవంతుడు కాబట్టి శిక్ష తప్పించుకోవచ్చేమో కానీ వాడొక రేపిస్ట్ అని అందరికి తెలుస్తుందిగా. అన్ని అనుకూలిస్తే నీవు గెలవనూచ్చు. ఎవరు అండ లేరు అని భయపడ్తున్నావు ఏమో నిన్ను ఇక్కడకు పంపారుకదా dr. విమల తను ఖచ్చితంగా నీకు అండ నిలబడుతుంది. రేప్ కేసుల్లో ఒక డాక్టర్ రిపోర్ట్ చాల ఇంపార్టెంట్. తను ఎన్ని వత్తిడులు వచ్చినా తలవంచని ధీరురాలు. నీవు మాదగ్గర వున్నావన్న సాక్షం నేనిస్తాను. ఇంకోసారి ఆలోచించు. లేదు!! వాడిని వాడి పాపానికి వాడిని వదిలేసి నీవు కొత్త జీవితం మొదలు పెట్టుకుంటావేమో నీ ఇష్టం. ఏదైనా నిర్ణయం నీదే." అని తను చెప్పాల్సింది చెప్పి ఇక చెప్పడానికి ఏమి లేదన్నట్టు మమ్మల్ని ఆశ్రమం చూడమని చెప్పి సర్ వెళ్లిపోయారు. మేము ఆశ్రమం అంతా చూసి మా హాస్పిటల్ కు వచ్చాము. 


"అక్కడి అభాగ్యులు, సార్ మాటలు నామీద బాగా ప్రభావం చూపించాయి. అయినా ఆ ఊపులో నిర్ణయం తీసుకోలేదు అమ్మా "


"తర్వాత అన్ని వైపులా ఆలోచించాను. పెళ్లి చేసుకుంటే భర్త మంచివాడైతే పర్లేదు అసలు ఇలాంటి ఘటన తర్వాత చెప్పకుండా పెళ్లిచేసుకొనేది లేదు. ఎప్పుడోఅప్పుడు తెలుస్తుంది చెప్పి పెళ్లి చేసుకుంటే ఆదరించి చేసుకునేవాడు నేను కేసు పెట్టినా చేసుకుంటాడు కదా!! ఇదే అనిపించింది అమ్మ. అంతే కాదు మన గౌరవం కుటుంబంలో పరిస్థితులు అన్ని చూసాను. మీ తరం కన్నా ఇప్పటితరం చాల ఉన్నతంగా ఆలోచిస్తున్నారు. నాలుగైదు రోజుల తర్జన అనంతరం నేను ఈ నిర్ణయానికి వచ్చాను. నా నిర్ణయం విన్నవెంటనే మా డాక్టర్ ఎంతో సంతోషించారు. వెంటనే dr. విమల గారి తో మాట్లాడారు ఇద్దరు కలసి ఒక అవగాహన వచ్చి ఇంక లేటు చేయకూడదని చెప్పి నేను హైదబాద్లో ఫ్లైట్ దిగగానే ఇంటికి రాకుండా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు ఫైల్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నేనూ సరే అన్నాను. నాన్నకు ఫోన్లో విషయం చెప్పాను. నాన్న కూడా సానుకూలంగా స్పందించటం తో నాకు వేయి ఏనుగుల బలం వచ్చింది. స్పందించటమే కాదు విమల గారిని కలిసి ఒక లాయర్ను మాట్లాడి నేను వచ్చే వేళకు అంత సిద్ధం చేశారు. " ఇదమ్మా జరిగింది అని చెప్పడం ముగించింది.


"ఏమే మరి నేనొకదాన్ని వున్నాను అని గుర్తుకు రాలేదా. నా సలహా సంప్రదింపు అవసరం లేదా" అని నొచ్చుకుంది శారద.


"అమ్మ!! నీకు చెప్తే ఒప్పుకోవు. భావోద్రేకానికి గురిఅవుతావు. ఏడ్చేస్తావు,. నీవు ఏడిస్తే నేను తట్టుకోలేను. అంతే తప్ప ఇంకొటికాదు . నీకు నచ్చచెప్పి నిదానంగా కేసు ఫైల్ చేయడానికి టైం లేదు." అనునయంగా చెప్పింది స్పందన. 


"అంతా బాగుంది కానీ స్పందన!! వారు బాగా బలమైన వాళ్ళు. వాళ్ళని తట్టుకోగలమా. ఎన్ని సినిమాలు చూడలేదు ఎంత చెత్త ప్రశ్నలు వేస్తారు.ఇవన్నీ ఎలా. ." తన భయం బయట పెట్టింది.


"అమ్మ సినిమాల్లో చూపించేది నిజం కాదు. ఇప్పుడు రూల్స్ చేంజ్ అయ్యాయి . వారు డబ్బువున్నవారు కాబట్టి బురద జల్లే ప్రయత్నం చేస్తారు. కొద్దిగా మనం తట్టుకొని నిలబడితే చాలు ఖచ్చితంగా వాడో రేపిస్ట్ అని ప్రపంచానికి తెలుస్తుంది. ఆ భగవంతుని దయవుంటే శిక్ష కూడా పడ్తుంది. చూద్దాం ఏంజరుగుతుందో. కనీసం పోరాడివోడితే తృప్తిగా ఉంటుంది: అని తన తల్లికి నమ్మకం కలిగేట్లు చెప్పింది స్పందన. 


"ఏమో స్పందన ఏమైనా నా మనసు ఒప్పుకోవటం లేదు . నీవు చేసిన పని అంత కరెక్ట్ కాదు" ఇంకా భయపడుతూనే అంది శారద. . 


"ఎంత మాత్రము తప్పుకాదు స్పందనచేసింది. పైపెచ్చు నూటికి నూరుపాళ్లు కరెక్ట్. దాని తప్పు ఎంత మాత్రం లేదు. చదువులో టాపర్. పిచ్చితిరుగుళ్లు తిరిగే పిల్ల కాదు. చేయని తప్పుకు తలొంచాల్సిన అవసరం లేదు. పరువు ప్రతిష్ట లాంటివి అసలే లేవు. తల్లిగా నీ భయం సహజం . ఒప్పుకుంటాను... కానీ నీవే కరెక్ట్ అంటే మాత్రం ఒప్పుకోను. నాకు ఆ రోజే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని వునింది... కానీ నా బిడ్డ అచేతనంగా ఎటువంటి స్పందన లేకుండా ఉండిపోవడం తో మొదట తను కోలుకోవడం ముఖ్యమని ఆగిపోయా. ఇప్పుడు నా చిట్టి తల్లి చేతన పొందిన స్పందన... కాబట్టి ఎటువంటి పరిస్థితిలో కూడా వాడిని వదిలే ప్రశ్నయే లేదు. ఏ స్వార్తం లేకుండా ఆ ఇద్దరు డాక్టర్లు మనకోసం చేస్తుంటే!!!. వద్దు శారద!! ఆపొద్దు!!!". అని గట్టిగ చెప్పాడు స్పందన తండ్రి సూర్య రావు అప్పుడే ఇంట్లొకొస్తూ...


"మీరంతా ఒకటయ్యాక నేను చేసేది ఏముంది"అని తన మాట ఎవ్వరు వినట్లేదే అని నిస్సహాయతతో అంది శారద. . 


"అమ్మ!! అక్క, నాన్న చెప్పింది నిజమే నా ఓటు కూడా వారికె" అని శ్యాం కూడా అక్కకు వత్తాసు పలికాడు. 

"సరే రా ఏది ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. ఇష్టమో అయిష్టమో నా కూతురే వెంటే నేను" చివరకు తన అంగీకారం తెలిపింది శారద. . 


" ఇంకేం అమ్మ ఒప్పుకుంది అంటే నేనే గెల్చినట్లే" ' అని తల్లి ఒప్పుకున్నందుకు ఎంతో సంతోషం తో తల్లిని గట్టిగా వాటేసుకుంది స్పందన. 


తల్లి ఆశీర్వాదం కూడా తోడవడంతో ధైర్యంగా ముందడుగు వేసింది చేతన పొందిన స్పందన ....



Rate this content
Log in

Similar telugu story from Inspirational