Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

SATYA PAVAN GANDHAM

Others


4.5  

SATYA PAVAN GANDHAM

Others


అంతరంగం

అంతరంగం

2 mins 361 2 mins 361

గతమే తలచుకోగా...

జ్ఞాపకమై గుర్తుకురాగా...

నీ ఊసే దూరమవగా...

నీ రూపే మాయమవగా...


అంతిమ సంస్కారానికి నోచుకోని నా కళ్ళు పొడారిపోయి చెమ్మగిల్లడం లేదు.

కానీ, మది మాటున దాగిన ఆ మమకారాన్ని నీ రూపుగా మలుస్తున్నాను.

శాశ్వత వీడ్కోలు పలకరాని నా మాట మూగబోయి బయట పడడం లేదు.

కానీ, యదలో దాగిన భావాన్ని అక్షరాలుగా అందిస్తున్నాను.


నా రాకకు నీతో పాటు స్వాగతం పలికే ఆ వీధి అరుగు నువ్వు లేవనే బెంగ తోనో లేక నా మీద కోపం తోనో ఈ సారి కన్నేత్తైనా కనీసం నా వంక చూడలేదు.


ఆరుబయట కూర్చుని మనం ఒకరిపై ఒకరం ఆడుకున్న పరాచకాలన్నీ విన్న ఆ ఇంటి వాకిలి కూడా ఆఖరి రోజుల్లో నీకు తోడుగా లేనని నన్ను చూసి మొహం చాటేసి ఏడుస్తూ వెల వెల బోయింది.


పగలు రేయి తేడా లేకుండా తిరుగుతూ పంచుకున్న ప్రతి విషయం ఆ వానపల్లి వీధులు, యేటి గట్టు విన్నాయి కదా...

అందుకే అన్నింటినీ విడిచి నీ దారి నువ్వు చూసుకోగానే అవి మూగ బోయి ఈ సారి నను పలకరించడం మానేశాయి.


నేను వెళ్లిపోతుంటే నీతో పాటు అడ్డు తగిలే ఆ ఇంటి గేటు ఈ సారెందుకో మరి!! 

నువ్వు మళ్ళీ తిరిగొస్తావని నీకోసం ఎదురుచూస్తూనో! 

లేక నేను అక్కడుండడం ఇష్టం లేకనో! నా దారికి అడ్డు తగల్లేదు.


అహం, కోపం అనే అడ్డు గోడ కట్టుకున్నామని అనుకుంటున్నారు అంతా... కానీ అది అలక, ఆప్యాయత తో కూడిన పారదర్శకపు అడ్డు తెరేనని, అది నీకు నాకు మాత్రమే అర్ధమవుతుందని వాటికి తెలియడం లేదు పాపం.


మనం మామా అల్లుల్లమని మాత్రమే చుట్టూ ఉన్న ప్రపంచం అనుకుంటుంది. కానీ, వయసు తారతమ్యమెరుగని ఓ గొప్ప స్నేహ బంధం మన మధ్య దాగి ఉందని వాళ్ళకి తెలీదు కాబోలు.

అందుకే కడుపుకు కలిగిన ఆకలికి పట్టెడన్నం పెట్టీ తీర్చగలుగుతున్నారు కానీ, 

నువ్ ఇక లేవు, రావని సంగతి తెలిసిన మనసు కి కలిగిన ఆకలి మాత్రం తీర్చలేకపోతున్నారు.


గతమంతా జ్ఞాపకంలా మారి మదిలో మెదులుతూ నిన్ను అనుక్షణం గుర్తుకుతెస్తున్నాయి. అందుకే నువ్వు లేని చోట క్షణమైనా నిలబడ్లేకపోయాను. 


ఎవరో ఏదో అన్నారని కాదు కానీ, 

చివరి క్షణాల్లో నీ చెంత లేనందుకు ఇప్పుడు చింతించినా ప్రయోజనం లేదనే ఆవేదన నాది,

పండక్కి కి వచ్చి నీతో సరదాగా గడపాలనుకున్నా ఇంతలోనే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావనే ఆక్రోధన నాది.


ఒకసారి నిను చూడాలని ఉంది, నీతో మాట్లాడాలని ఉంది.

అది అనితర సాధ్యం కదూ...

అందుకే ఈ చిత్రాన్ని నిను ఊహించుకుంటూ గీసాను, 

ఇందులో ప్రతీ అక్షరం నిను తలచుకుంటూ రాశాను.


People are thinking that you will never come back again

Buy they don't know you always lives in my He"art"


                       ఇట్లు

               మిత్రుడిలాంటి నీ మేనల్లుడు.


Rate this content
Log in