Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

MANTRI PRAGADA MARKANDEYULU

Tragedy

2  

MANTRI PRAGADA MARKANDEYULU

Tragedy

కాలమె కాటేస్తే

కాలమె కాటేస్తే

1 min
299


కాలమే కాటేస్తే - కోపమే తాపమై 

కాలంతో జగడం - లోకంతో పబ్బం 

శాపాల పాపినై - దారిద్ర బంధంలో 

నను నేనె మరిచా- ఈ కష్టాల మైకంలో //


ఇంతేరా లోకము - ఇదేరా జీవనము //


అపస్వర రాగము  

అపార్థాల లోకము 

తూర్పున ఉదయించే సూర్యుడు 

పడమట వెలుగొందే చంద్రుడు // కాలమే కాటేస్తే //


కలలోని కావ్యమా - కాషాయ లోకమా 

భువిలోని మనిషికి - మతిచెదిరే భాష్యము 

ఓ గారాల కాలమా - నీవింత కఠినమా 

నయనాల శున్యము - ఈ లోకమంతా భారము// 

కాలమే కాటేస్తే //


మణులున్న సంద్రమా  

నీకెందుకింత ద్వేషము 

శ్వాసున్న జీవము 

ఓ సుకుమార ప్రాణము // కాలమే కాటేస్తే //


కాలం చెల్లె ఈ లోకంలో - మనుగడ లేని ఈ జీవం 

నమ్మించే ఓ కాలమా - మోసమే నీ నైజమా 

జాలిలేని కాలమా - ఎందుకింత శాపము 

చివరకు కాటిలోన బూడిదాయె దేహము // కాలమే కాటేస్తే //


ఎందుకురా ఈ ఆరాటాము 

ఇంతేరా జీవితం 

మోసపోయిన జీవి 

గాలిలొ కలిసే ప్రాణం // కాలమే కాటేస్తే //


ఇంతేరా జీవితం 

ఇదేరా లోకము // కాలమే కాటేస్తే //



Rate this content
Log in

Similar telugu poem from Tragedy