Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sravani Gummaraju

Drama

3  

Sravani Gummaraju

Drama

రక్తపు పోగు

రక్తపు పోగు

1 min
302


*అ*మ్మలో సగం 

నా*న్న*లో సగం

దేవుడిచ్చిన వరం

అడుగులు నావైతే ఆ గుర్తులు గీసిన చెయ్యొకటి ఉంటది

నవ్వులు నావైతే అవి విరబూయించిన పలుకులు ఉంటాయి

కన్నీళ్లు నావైతే ఆవేదన కూడిన మనసోకటి ఉంటది

చెదిరే కలను ఒడిసిపట్టి వెలుగుల వొత్తులు చేర్చి చిరుదివ్వెలా వెలిగించి కళ్ళకాంతుల నక్షత్రాలు పూయించే తపన ఉంటుంది  

గమ్యానికి దారులు వెతికి పాదాలకు పట్టీలుగా మార్చి నిత్యం సవ్వడితో గమనంలో తొడొచ్చే నీడలా ఉంటుంది

భయమో, భాద్యతో బదులుగా బరువు మోస్తూ నాబంగారు జీవితానికి భరోసాగా నిలిచేది బంధమే...

బంధానికి ఒక రోజంటే మన బంధానికి విలువ ఎక్కడో అర్థమే కాదు ఇక ఇవ్వాలే గుర్తు చేసుకోవడానికి నాకు మిగిలిన రోజులలో గుర్తుండదు అనే అపవాదు నచ్చదు.

అందుకే నా జీవితంలో నిన్న ఈరోజు రేపు జీవితాంతం నాకు గొడుగై నిలిచే బంధం అది ఇవాళ మాత్రమే కాదు జీవితాంతం నాకు నాతోడుగా ఉండాలని కోరుకుంటూ....

 జీవితాన వెలుగులు పంచె పున్నమి చంద్రునిలా ఎపుడు చల్లని వెన్నెల వెదజల్లే నీకు నాకు మధ్య ఒక రక్తపు పోగు సాక్ష్యంగా....


Rate this content
Log in