Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Praveena Monangi

Inspirational


4  

Praveena Monangi

Inspirational


జీవితం

జీవితం

1 min 285 1 min 285

 

 రానంది గడిచిన కాలం నేనెంత బ్రతిమాలినా!

పోనంది చేదు జ్ఞాపకం తరిమి తరిమి కొట్టినా!

ప్రాయం ఆగనంటూ ఉరకలు వేస్తుంది 

ఆశయాల సాధనలో ఆయువే ఆవిరయిపోతుంటే 

 బంధాలే బదులీయక బరువులవుతుంటే 

అభిమానం అంగట్లో అమ్ముడవుతుంటే 

అనురాగం అరువుకి అందివచ్చునా!

ఆప్యాయత వెచ్చిస్తే లభించునా!

 మమకారం మది అంతరాలలో 

మరుగున పడుతుంటే 

 కారుణ్యం కరువుకి కనుమరుగవుతుంటే 

 విలువలు వలువలు విడుస్తుంటే 

ఆనందం అందేనా.....

సంతోషం ఇంతేనా?


Rate this content
Log in

More telugu poem from Praveena Monangi

Similar telugu poem from Inspirational