Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sri Bharadwaj Rangavajhula

Drama

4.7  

Sri Bharadwaj Rangavajhula

Drama

చింత యేలరా !!!

చింత యేలరా !!!

1 min
530


చెంత లేని వారి గూర్చి చింత యేలరా 

నీకు అంతలోన అంతమవునదేది లేదురా 

సొంతమను తోచు వారలంతలోనే

నీకు అందనంత దూరమునుండి యీ వింతగాంచురా || ||


సంద్రమందు నీరుబీల్చి మేఘముగా పేరు మోసి 

పరువులెత్తి కొండలలో వర్షించినా 

ఆ నీరే యేరులా పారి ఉరకలేసినా  

చింత లేదు సంద్రానికి ఒక్కింతైనా || ||


ఆ పాత జలముతో సొగసగు జలపాతమై 

నదములలో తిరిగినా,పొలములన్ని తడిపినా  

ధరణిలోన ఒదిగినా ఉద్ధరణిలోన దాగినా 

చింత లేదు సంద్రానికి ఒక్కింతైనా || ||


దూరమెంత సాగినా,ధారలై రాలినా 

పేర్లు యెన్ని దాల్చినా,రూపులెన్ని యెత్తినా 

పయనమును ఆపును తన పుట్టినిల్లునా 

చింత లేదు సంద్రానికి ఒక్కింతైనా || ||


అలసి చెమటతోడ కలిసియున్న బిడ్డనీ 

అక్కున యా మలినము  తా వహించె రా 

ఘనమైన గుణములన్ని లో దాచినా 

కడకు లవణార్ణవమని పేరు మిగిలెరా || ||


తలవదు రా తన అంశను ఏ నిమిషమైనా 

విడువదురా తన ధర్మమునేగతులైనా 

ఈ గాథ తెలిసుకొని నిదురపోరా 

అగాథమున దాగు బుద్ధి మేలుకొలపరా || ||



Rate this content
Log in

Similar telugu poem from Drama