I'm శ్రీ శివ లక్ష్మి and I love to read StoryMirror contents.
Share with friendsగజల్ నా దుఃఖం నాకివ్వు ఓ కవితరాసుకోవాలి ఓ శూన్యం బదులివ్వు ఓ కథగముగిసిపోవాలి ఆ దూర తీరాల్లో నే కలగన్న గమ్యాలు ఆ మార్గం కరిగించు నా మనసు చేరుకోవాలి ఎదలోపల ఎవరెరుగని ఈ గాయాల సలుపేంటి ఓ కునుకును వరమివ్వు నే కలగకరిగిపోవాలి జాలి లేని కాలానికి ఏ జావళి పాడగలను నా గతమును తిరిగివ్వు చిరునవ్వు పూసుకోవాలి మండని ఏ గుండెలకూ గెలుపుండదు ఓ సత్యా!! ఏ మరణం రానివ్వు ఓ చరితరాసిపోవాలి… సత్య స్వరాళి
ఎదురుచూస్తూ ఎదురొస్తే అల్లరిగాలి ఎగతాళి చేస్తుంది అలికిడికే ఉలికిపడిన మనసు తలపుల్లో నిన్నే మోస్తోంది